హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ మెకానిక్ అదృశ్యంపై కేసు నమోదు

WG: పేరుపాలెంలో నివాసముంటున్న బైక్ మెకానిక్ దొంగ మణికంఠ (32) అదృశ్యమైనట్లు SI సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. భీమవరం మండలం వెంపకు చెందిన ఆయన.. ఈ నెల 21న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.