హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 24న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్

KNR: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. బంద్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఆటో కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు, వార్షిక ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.