ధనురాసనం వేయడం వల్ల వెన్నెముకను సాగదీసి నడుము నొప్పిని తగ్గిస్తుంది. పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి తెచ్చి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఛాతీ భాగాన్ని తెరిచి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుచుటకు, అలసటను పోగొట్టుటకు తోడ్పడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెన్ను సర్జరీలు అయినవాళ్లు, గర్భిణులు ఈ ఆసనం వేయరాదు.
ఆరోగ్యం
ధనురాసనం వల్ల కలిగే ఉపయోగాలు


