హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీ కేంద్రాలతో చిన్నారుల మానసిక వికాసం'

ASR: అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల మానసిక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని సీడీపీవో రమణకుమారి తెలిపారు. కశింకోట డీపీఎన్ జడ్పీ పాఠశాలలో 'జ్ఞాన జ్యోతి' శిక్షణ (ఫేజ్-3) కార్యక్రమంలో భాగంగా నిన్న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యకర్తలకు సమ్మిళిత విద్యపై అవగాహన కల్పించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణను అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.