హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలతో చిగురిస్తున్న రైతు ఆశలు

PPM: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు చెరువులకు నీరు చేరడంతో, నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎండ తీవ్రతకు ఎండిపోయిన నారుమళ్లకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చినప్పటికీ, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్‌ గట్టెక్కుతుందా లేదా అనే సందేహం మాత్రం రైతులను ఇంకా వెంటాడుతూనే ఉంది.