హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురిటి నొప్పులు వస్తే బైక్ పైనే ప్రయాణం

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంగశివిని తండా-2కు రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇటీవల మధుకర్ రాథోడ్ తన కుమార్తెకు పురిటినొప్పులు రావడంతో వీరేగాం వరకు బైక్‌పై తీసుకెళ్లారు. ఆపరేషన్ అనంతరం ఇంటికి తీసుకురావడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.