హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు తగ్గిన వరద.. గేట్లు మూసివేత

GDWL: ఆల్మట్టి డ్యాం నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. దీంతో నిన్న రాత్రి అధికారులు స్పిల్‌వే గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్టులోకి 57,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, జలవిద్యుత్ ఉత్పత్తి , ఇతర కాలువల ద్వారా దిగువకు 36,667 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 318.40 మీటర్లుగా ఉంది.