హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది అరెస్ట్!

SRPT: నూతనకల్ మండల కేంద్రం గ్రామ శివారులో అక్రమంగా పేకాట ఆడుతున్న 11 మందిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై నాగరాజు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 5500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు.