హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బిక్కనూర్ మండలంలో మోస్తరు వర్షం

KMR: బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్, సిద్ధిరామేశ్వర్‌నగర్, బస్వాపూర్, అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. నాలుగు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో వేసిన పంటలు ఎండిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పంటలకు మేలు జరుగుతుందన్నారు.