JGL: మల్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న రామాలయ భూమి పూజ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న జరగనున్న భూమి పూజకు స్థానిక ఎమ్మెల్యే సత్యంను రామాలయ కమిటీ సభ్యులు శనివారం ఆహ్వానించారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రిక అందజేశారు.
తెలంగాణ
రామాలయం భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


