హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒత్తిడి సమస్యలకు ఆక్యుపంక్చర్ వైద్యం

BPT: రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరం ప్రారంభమైంది. డాక్టర్ నీలిమ ప్రియదర్శిని పర్యవేక్షణలో కీళ్ల నొప్పులు, మైగ్రేన్, ఒత్తిడి వంటి సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం కూడా ఈ శిబిరం కొనసాగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని రోటరీ క్లబ్ కార్యదర్శి ఖాసీం, కోశాధికారి బాలాజీ కోరారు.