హైదరాబాద్: 28°C
తెలంగాణ

బయ్యారంలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

MHBD: బయ్యారం మండలంలోని నామాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌కు చెందిన బచ్చల హరికృష్ణ కొత్తపేటలోని పూర్ణ టైల్స్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం అన్నతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో బైక్ అదుపుతప్పి వారి వాహనాన్ని ఢీ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి.