హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెస్టారెంట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సీపీఆర్ చేసినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.