SRPT: మునగాల మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో ఖాళీగా ఉన్న స్కావెంజర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం ఏడవ తరగతి చదివి ఉండాలని, స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులు ఈ నెల 25లోగా ఎంఆర్సీలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
తెలంగాణ
స్కావెంజర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


