హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక దోపిడీకి బ్రేక్.. మూడు వాహనాలు సీజ్

MNCL: చెన్నూరు మండలం కత్తెరశాల వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్న వాహనాలపై మైనింగ్ అధికారులు శనివారం దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సహాయంతో వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్టేషన్ తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.