హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ADB: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కదాన్ని అనుమానాస్పదంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతనే ముందుకు కొనసాగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తెలియజేశారు. జిల్లాలో ఈ వారం సైబర్ నేరాలకు సంబంధించి 32 ఫిర్యాదులు వచ్చినట్లు అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.