హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ సమస్యల పరిష్కారానికి పోలీసుల కౌన్సెలింగ్

సత్యసాయి: హిందూపురంలో కుటుంబ సమస్యల పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో, అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో కుటుంబ సలహా కేంద్రం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సీఐ జనార్దన్ సూచించారు.