హైదరాబాద్: 28°C
తెలంగాణ

26 మందిని బురిడీ కొట్టించి రూ.28.14 కోట్ల మోసం

SRD: గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట రూ. 28.14 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను జహీరాబాద్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అధిక లాభాల ఆశ చూపి 'నేకీ ట్రేడర్స్' సంస్థ ద్వారా 26 మంది వద్ద నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము సేకరించి మోసగించినట్లు సీఐ రవి, ఎస్సై లవకుమార్ వివరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.