హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ ముప్పులపై వాకర్స్‌కు అవగాహన: సీఐ

SRD: సైబర్, నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పటాన్‌చెరు సీఐ ఎం.రవీందర్ సూచించారు. పటాన్‌చెరు మిత్ర గ్రౌండ్‌లో వాకర్స్‌కు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.