హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 24 నుంచి ఆటోల బంద్

JGL: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు TG ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు తెలిపారు. జగిత్యాలలో జరిగిన సమావేశంలో ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్లకు నెలకు రూ.12 వేల సాయం, ఆటోనగర్ల ఏర్పాటు హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.