హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్: ఎస్సై

KMR: విద్యుత్ నియంత్రికల్లో నుంచి సామగ్రిని అపహరిస్తున్న నిందితుడిని శనివారం మద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భీంరావు అనే వ్యక్తిని పట్టుకుని విచారించారు. సామగ్రిని చోరీ చేసి ఔరంగాబాద్‌లో విక్రయిస్తున్నట్లు ఒప్పుకొన్నాడు.