హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు

NZB: నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో DMHO డాక్టర్ బి. రాజశ్రీ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఎస్ బాలాజీ, అయ్యప్ప, బాంబే నర్సింగ్ హోమ్‌లలో పార్కింగ్, ర్యాంప్, వైద్య వ్యర్థాల నిర్వహణ, రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ప్రదర్శనలో లోపాలను గుర్తించారు. నిబంధనలను వెంటనే సరిచేసుకుని క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సేవలు అందించాలన్నారు.