కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని 16వ వార్డులో రూ.10 లక్షలతో జీఐ షెడ్, 1వ వార్డు కొత్తూరులో రూ.10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం శనివారం శంకుస్థాపన చేశారు. మంత్రి సుభాష్ ప్రత్యేక చొరవతో పట్టణ అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని సత్యం తెలిపారు. గత రెండేళ్లలో పట్టణంలో సుమారు రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


