హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవలస పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

VZM: విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ శనివారం కొత్తవలస పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహ ఆశీర్వాద కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావడంతో ఎల్.కోటలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తిరుగు ప్రయాణంలో విజయనగరం వెళ్లేందుకు కొత్తవలస మీదుగా వెళ్లిన సందర్భంగా ఎస్పీ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు.