హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1, 2 ఏడీఈలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. సప్తగిరి హిల్స్, తాహెరా మసీదు, శ్రీనగర్, భవానీ, లక్ష్మీగణపతి, మల్లికార్జున కాలనీల్లో ఉదయం 10 - మధ్యాహ్నం 12.30 వరకు, ఎస్టీకాలనీ, అంబేడ్కర్‌నగర్, శివాజీనగర్ ఉదయం 10 - సాయంత్రం 4 వరకు సరఫరా ఉండదని వెల్లడించారు.