KNR: రానున్న 3–4 గంటల్లో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం సమయంలో గంటకు 40 కిలోమీటర్లలోపు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్


