హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లాడకు త్వరలో గోదావరి జలాలు

KMM: తల్లాడ మండలంలోని చెరువులను కాంగ్రెస్ నాయకులు శనివారం పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా సిరిపురం మేజర్ కాలువ ద్వారా లక్ష్మీనగర్ వరకు పనులు పూర్తవడంతో త్వరలో నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిపారు. దీంతో తల్లాడతో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు.