హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన గ్రామంలో పర్యటించిన అడిషనల్ DMHO

BDK: మణుగూరు మండలం వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన రేగుల గండిని శనివారం అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సైదులు సందర్శించారు. అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించి మందులు ఇచ్చారు. జ్వర సర్వేను పరిశీలించి తగు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. వారితోపాటు డాక్టర్ ఉమాదేవి, ఏఎంవో వెంకటేశ్వర్లు ఉన్నారు.