హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురముళ్ళ ఆలయ పునఃనిర్మాణ పనులు పరిశీలన

కోనసీమ: మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శనివారం పరిశీలించారు. ఆలయ ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఏసీ వి.సత్యనారాయణ, ఆలయ సిద్ధాంతి యనమండ్ర సత్య సీతారామ శర్మతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. గర్భాలయం, అంతరాలయం, నంది మండపం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.