హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడి కేసులో ఎనిమిది మంది అరెస్ట్

సత్యసాయి: మడకశిర మండలం రంగపురంలో పాత కక్షలతో దాడికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్‌రూమ్ నిర్మాణ వివాదంలో హనుమంతరాయ కుటుంబంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటనపై కేసు నమోదైంది. మధుగిరి సర్కిల్ వద్ద నిందితులను పట్టుకుని, మడకశిర పోలీసులు రిమాండ్‌కు తరలించారు.