హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేతాజీ విగ్రహం చుట్టూ బ్యానర్లు

MBNR: జడ్చర్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం చుట్టూ ఇష్టారాజ్యంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కూడలిలో ఉన్న విగ్రహం కనిపించకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించి విగ్రహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.