హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల సత్తా

SDPT: రాష్ట్రస్థాయి 'జిజ్ఞాస–2025–26' పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కళాశాల నుంచి ఎంపికైన నాలుగు పరిశోధనాత్మక ప్రాజెక్టులు ఆగస్టు 17–19 వరకు జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో స్థానం పొందాయి. విద్యార్థుల కృషిని అధ్యాపకులు అభినందిస్తూ, పరిశోధనలపై ఆసక్తిని ఇలాగే కొనసాగించాలని సూచించారు.