KKD: గొల్లప్రోలు పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. రాయవరం సెంటర్‌లో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ మామిడాల సూరిబాబు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో చిరంజీవి జన్మదిన వేడుకలు


