VZM: ప్రకాష్ మణి దాధీజీ 19వ పుణ్యతిథిని పురస్కరించుకుని గరివిడి బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మకుమారీ సేవా కేంద్రంలో శనివారం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి అనూహ్య స్పందన లభించగా 32 మంది రక్తదానం చేశారు. విజయనగరం రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. బీకే హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత రక్తదాన శిబిరానికి విశేష స్పందన


