హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కార్యకర్తలకు ఫేజ్-2 శిక్షణ

W.G: తాడేపల్లిగూడెం తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ఫేజ్-2 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలతో కూడిన విద్య ద్వారా చిన్నారులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని ఐసీడీఎస్ CDPO టీఎల్ సరస్వతి తెలిపారు. చిన్నతనంలోనే అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం ద్వారా పిల్లలు పాఠశాల వాతావరణానికి అలవాటు పడతారన్నారు.