హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకర భవనాలపై హైడ్రా ఫోకస్

HYD: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో కూలిన ఏడంతస్తుల భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎంసీతో కలిసి అంజయ్యనగర్‌లో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని వెల్లడించారు.