హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో సత్యదేవుని వ్రతాల సందడి

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రావణ శనివారం కొండ కింద వ్రత మండపంలో అధిక సంఖ్యలో దంపతులు వ్రతాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు వ్రతాల ద్వారా ఆలయానికి రూ.2.81 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. క్షేత్రంలో వ్రతం ఆచరించడం పుణ్యఫలమని భక్తుల విశ్వాసం.