హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలి'

SRPT: ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తిలోని సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వర్షాభావ ప్రభావం వలన తుంగతుర్తి ప్రాంతంలో రైతులు వేసుకున్న వరి పంట ఆదిలోనే ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.