KMM: కారేపల్లి మండల ప్రజలు జనన, మరణ, వివాహ నమోదులను నెలలోపు గ్రామపంచాయతీల్లో చేయించుకోవాలని ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు శనివారం సూచించారు. నెల దాటిన తర్వాత నమోదు ప్రక్రియకు న్యాయాధికారి ద్వారా సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 6 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయని, సకాలంలో నమోదు చేసుకుంటే భవిష్యత్ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'జనన, మరణ నమోదును సకాలంలో చేయించుకోవాలి'


