హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రాగన్ ఫ్రూట్ అలంకరణలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి

KDP: గోపవరం మండలం వల్లేరవారిపల్లెలో వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి శ్రావణ మాసం రెండో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. అనంతరం డ్రాగన్‌ ఫ్రూట్‌, నిమ్మకాయలు, తమలపాకులు, తులసి ఆకులతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణలో స్వామివారిని భక్తులు కన్నులపండువగా దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.