హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షనర్ల సమస్యలపై ఈనెల 27న ధర్నా

KNR: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. శనివారం పెన్షనర్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను చెల్లించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.