హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడేళ్లుగా అసంపూర్తిగా రైతు వేదిక బాత్రూములు

BHPL: గోరికొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్‌లో రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతు వేదికకు మూడేళ్లు పూర్తయినా బాత్రూముల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. గోడలు నిర్మించినా తలుపులు, ఇతర పనులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.