RR: ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న అంబర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు పురుషుడిగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మూసీలో గుర్తుతెలియని మృతదేహం


