హైదరాబాద్: 28°C
వార్తలు

అజాంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్యపై సమావేశం

WGL: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అజాంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్య పరిష్కారంపై జిల్లా కలెక్టరేట్‌లో శనివారం అధికారులు, పిటిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలపై అభిప్రాయాలు తెలిపేందుకు కార్మికులు సమయం కోరగా, వారి సూచనల మేరకు మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.