హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు శిక్ష

ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు చెల్లని చెక్కు కేసులో బోనకల్ మండలం జానకీపురానికి చెందిన అన్నెపోగు సత్యంబాబుకు ఏడాది జైలుశిక్ష విధించింది. 2020లో పాలాది రామ నాగేంద్రరావు వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకుని ఇచ్చిన చెక్కు నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో కోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ శనివారం తీర్పు వెల్లడించారు.