హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఏలేశ్వరంలో రూ.1.45 కోట్లతో అభివృద్ధి పనులు'

KKD: ఏలేశ్వరం మున్సిపాలిటీలో రూ.1.45 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శనివారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు. 1, 2, 18, 20 వార్డుల్లో పనులను ప్రారంభించారు. పట్టణాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రకాష్, డీఈ ధర్మతేజ, కూటమి నాయకులు పాల్గొన్నారు.