హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతిపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.!

HYD: BJP రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భూ-భారతి పేరుతో ప్రైవేటు భూములను 22A జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులకు BJP లీగల్ సెల్స్ అండగా ఉంటాయన్నారు.