హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళిత స్మశానాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి'

PPM: దళితుల స్మశానాలకు జీవో నంబర్‌ 1235 ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి కోరంగి సీతారాం డిమాండ్‌ చేశారు. శనివారం జియ్యమ్మవలస అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్మశానాలకు స్థలం, రహదారులు, నీటి వసతి, షెడ్లు, ప్రహరీలు నిర్మించాలని కోరారు.