హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయులు నైపుణ్యాలు పెంచుకోవాలి'

అన్నమయ్య: క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయులు పరస్పరం పాఠ్యాంశాలపై చర్చించుకోవడం ద్వారా బోధనా సామర్థ్యం మెరుగుపడుతుందని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ అనురాధ అన్నారు. శనివారం పీలేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కోటపల్లె బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో జరిగిన సమావేశాలను ఆమె పరిశీలించారు. గణితంలో నైపుణ్యాలు పెంచుకుని బోధించాలని సూచించారు.