హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పూజ

WGL: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కే.పూజ పదోన్నతి ప్రాతిపదికన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఇంఛార్జి కార్యదర్శి ఏ.ప్రదీప్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.